రాజంపేట ( జనస్వరం ) : సంక్రాంతి పండగ సందర్భంగా మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ఆధ్వర్యంలో సుండుపల్లి వీరబల్లి మండలాలలో జరిగిన క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి. దాదాపు 25 జట్లు పాల్గొన్న ఈ క్రికెట్ పోటీలలో ఫైనల్ లో రాయవరం Vs చిన్నగొల్లపల్లి తలపడగా రాయవరం ఫైనల్ లో ఘన విజయం సాధించి జనసేన పార్టీ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ చేతులమీదుగా విజేతగా నిలిచిన రాయవరం టీం కు 30 వేల రూపాయలు మరియు జనసేన పార్టీ టోర్నమెంట్ కప్పును అందజేశారు. అలాగే రన్నరఫ్ గా నిలిచిన చిన్నగొల్లపల్లి టిం కు 15వేల రూపాయలు బహుమతిని అందజేశారు. ఫైనల్ మ్యాచ్ మరియు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆటగాడు షేక్ ఆప్రూజ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాన్ అఫ్ ది సీరియస్ గా ఎన్నిక చేసి ట్రోఫీ బహుమతిని అందజేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ R.హరి, A.అర్జున్, V.వెంకటరమణ, L.రవీంద్ర, R. వెంకటేష్, గార్లను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది..ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమని దేశానికి యువత వారి ప్రతిభ చాలా అవసరమని ప్రతిభ ఉన్న యువతను గుర్తించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండడమే జనసేన పార్టీ ఉద్దేశమని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ క్రికెట్ పోటీలో నిర్వహించడం జరిగిందని ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా బాగా రాణించారని వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక క్రీడా రంగంలోనే కాకుండా అనేక రంగాలలో రాణిస్తున్న రాజంపేట నియోజకవర్గంలో యువతను గుర్తించి అన్ని విధాల సహాయ సహకారాలు ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కాకుండా సామాజికవేత్తలు కార్పొరేట్ సంస్థల పెద్దలు ప్రతి ఒక్కరు కూడా యువతను సామాజిక సేవ కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని ఇటువంటి క్రీడా నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఆ విధంగా జనసేన పార్టీ యువతకు కొండంత అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.సుండుపల్లి వీరబల్లి,మండల నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున, జిగిలి ఓబులేసు, సుధారాణి, రూప, గణపతి ,విజయ భాస్కర్,శ్రీరాములయ్య,Dr.వెంకయ్య, Dr.రమణ, బోడిగోలా రమణ, అలీ కుమార్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.