Logo
Date of Publish : 08 March 2022, 6:19 am
Editor : Sake Naresh

సృష్టికే.. సృష్టికర్తలు మహిళలు అన్నిరంగాల్లో పురోగతి సాధించాలి : పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్ దేశినీడి

   పిఠాపురం, (జనస్వరం) : కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి... పాదాభివందనం!! తన కుటుంబం కోసమే కాకుండా నేటి మహిళ సమాజం, దేశం కోసం కూడా తన శక్తి సామర్థ్యాలను పంచుతోంది. మహిళా సాధికారత దేశానికి, సంస్కృతికి గర్వకారణం. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా మహిళలు ఎదుగుతున్నారు. ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒకచోట తమ కార్తవ్యన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. పుట్టినప్పట్టి నుంచి ప్రాణం పోయే వరకు తానంటేనే సేవ.. అనేలా ప్రతి ఒక్క విషయంలో పురుషులకు తోడు నిలుస్తుంటారు స్త్రీలు. వీటికి ప్రతిఫలంగా తనకంటూ కాస్తంత ప్రేమ… ఓదార్పు.. తోడు మాత్రమే కోరుకుంటుంది. కొంచెం ప్రేమను చూపిస్తే చాలు లెక్కలేనంత సంతోషంతో మునిగిపోతుంది. అలాంటి మహిళలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. స్త్రీ సమానత్వం, సాధికారతలే మన సమాజ ప్రగతికి మూలమని జనసేనపార్టీ ఆవిర్భావ దినం నుంచీ జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్న సిద్ధాంతం. ప్రతి రంగంలోనూ తన సత్తా చాటుతూ సమాజ ప్రగతికి, కుటుంబ సంక్షేమానికి సమానం కంటే ఎక్కువ బాధ్యతను నిర్వర్తిస్తోన్న స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలలో పురోగమిస్తున్న మహిళలందరికీ పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్ దేశినీడి శుభాకాంక్షలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com