Logo
Date of Publish : 26 July 2022, 3:09 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే సీపీఎస్ రద్దు చేస్తాం

- పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

    నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 71వ రోజున మూలాపేటలోని విక్టోరియా గార్డెన్స్ ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన జగన్ రెడ్డి మాట తప్పి ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేశారని అన్నారు. పీఆర్సీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర నష్టం చేసిందని, ఉద్యోగుల నెలనెలా జీతాలు, పెన్షన్లు సమయానికి వేయట్లేదని, బోనస్లు, ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు కనీసం నెలనెలా జీతమైనా సమయానికి వస్తే చాలానే దారుణమైన పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం కల్పించిందని ఎద్దేవా అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే సీపీఎస్ ను రద్దు చేస్తామని, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో ఈ ప్రణాళికను పొందుపరచామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com