● సీపీఎస్ రద్దు విషయంలో మాట తప్పిన సీఎం జగన్
● కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదు
● సూళ్లూరుపేట జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : సూళ్లూరుపేట మండల పరిధిలోని గోపాలరెడ్డిపాళెం గిరిజన కాలనీలో 33వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు అని ఉద్యమాలు చేసిన జగన్ తీరా సీఎం అయ్యాక నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచి సీపీఎస్ రద్దు గురించి అడిగితే కేసులు పెట్టడం, బైండోవర్లు చేయడం, సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యమంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం ఏమిటంటూ జనసేనపార్టీ సూళ్లరుపేట నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) రద్దు చేస్తానని హామీనిచ్చిన సీఎం వైఎస్ జగన్ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా చర్చలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. గ్యారెంటీ లేని జీపిఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దుపై చర్చిద్దామని ఉద్యోగసంఘాల నేతలను మంత్రులు పిలిచి జీపీఎస్ పై చర్చిద్దామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగులకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.అలాగే గ్రామంలోని ప్రజలకు పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు తెలియజేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పవనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.