Logo
Date of Publish : 26 December 2025, 8:21 pm
Editor : Sake Naresh

ఘనంగా 100 సంవత్సరాల సి పి ఐ జెండా ఆవిష్కరణ వేడుకలు. పట్టణంలో రెపరెపలాడిన ఎర్ర జెండా,

సత్తెనపల్లి లో ఘనంగా 100 సంవత్సరాల సిపిఐ జెండా ఆవిష్కరణ సంబరాలు, రెపరెపలాడిన ఎర్రజెండా

సత్తెనపల్లి,డిసెంబర్26.(జనస్వరం).

పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయంలో శుక్రవారం కమ్యూనిస్టు నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముసునూరు రమేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల కోలాహలం మధ్య కేకులు కట్ చేసి పండుగ వాతావరణం సృష్టించారు. చెంచు కాలనీలో సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి వి. లక్ష్మి చెన్నకేశవరావు, యానాది కాలనీలో ఏఐటీ యుసీ జిల్లా ఉపాధ్యక్షుల కంబాల శ్రీనివాసు, లెనిన్ నగర్ లో నరిసేటి తాండవ కృష్ణ లు పార్టీ జండా లను ఎగర వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు అండగా నిలబడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేశారు. కామ్రేడ్ నరిసేటి గురవయ్య ఆధ్వర్యంలో యానాది కాలనీ చెంచు కాలనీ, లెనిన్ నగర్ లలో 300 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించడ మైనదని నాయకులు వివరించారు. గురవయ్య పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ముట్టే రాంబాబు, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆర్ శేషయ్య, పొన్నూరు రోశయ్య , వెంకాయమ్మ, మన్యం నరసింహారావు, ఆవుల వెంకటేశ్వర్లు, జంపని నరసింహారావు, పోతురాజు, ఆవుల ఆనంద్, యువజన సంఘ నాయకులు ఎన్ శ్రీను, ఎన్ హనుమయ్య, కంబాల వెంకయ్య శ్రీహరి, డాక్టర్ సోహెల్, కంబాల ఆనంద్ యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com