Logo
Date of Publish : 12 May 2021, 4:15 pm
Editor : Sake Naresh

పెడనలో జనసేన పార్టీ తరుపున పాత్రికేయులకు కోవిడ్ రక్షణ సామాగ్రి అందజేత

              కరోనా కోరలు చాచి పంజా విసురుతుండడంతో ఎంతో మంది మహమ్మారి దెబ్బకు విగతజీవులవుతున్నారు. కోవిడ్ దెబ్బకు బలవుతున్న వారిలో పాత్రికేయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా విధి నిర్వహణలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరుగుతున్న జర్నలిస్టులను కరోనా పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో తమవంతు బాధ్యతగా పాత్రికేయ మిత్రులకు అండగా నిలిచేందుకు పెడన నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రాంసుధీర్ ముందుకు వచ్చారు. పెడన నియోజకవర్గం పరిధిలో పని చేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు రక్షణ నిమిత్తం హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు తదితరాలు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ సుధీర్ మాట్లాడుతూ పాత్రికేయులను డాక్టర్లు, పోలీసులు మాదిరి ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రమీణ ప్రాంత పాత్రికేయులకు వెంటనే రూ. 10 వేల ఆర్ధిక సాయం అందించాలని కోరారు. అలాగే కోవిడ్ సోకి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందించాలన్నారు. పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బందికి సైతం మాస్కులు, శానిటైజర్లు అందచేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com