
గంగాధర నెల్లూరు , (జనస్వరం) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని గత నెలలో వినతిపత్రం సమర్పించిన తరువాత, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు స్పందించి నగరాన్ని టూరిజం డెస్టినేషన్ సెంటర్ గా చేయుటకు సంబంధిత విభాగాన్ని చర్యలకు ఉపదేశించడం ఆనందంగా ఉందని నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ యుగంధర్ పొన్నాల గారు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్వేటి నగరం, సరిహద్దున రాజా పాలస్, వేణుగోపాల స్వామి దేవాలయం, స్కంద పుష్కరిణి ఏషియాలోనే అతి పెద్ద రెండవ కోనేరు, కామాక్షమ్మ దేవాలయం, శివాలయం, బంగారమ్మ దేవాలయం, సాయిబాబా గుడి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, రాజరాజేశ్వరీ దేవాలయం, నరసింహ స్వామి దేవాలయం, కనికల్ల దానా, కృష్ణాపురం ప్రాజెక్ట్, నిస్సంకు దుర్గం, శివాలయం కాశి తోట, వరద వెంకటేశ్వర స్వామి టెంపుల్, మండపాలు, దర్బార్ హాల్, రాణి మహల్, అద్దాల మండపం, మత్స్య విలాసం, ఏనుగుల బావి, కోట చెరువు, ధర్మరాజుల గుడి, శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు వేద పాఠశాల, నాదస్వరం పాఠశాల, లాంటివి ప్రాచుర్యం పొందిన దేవాలయాలు ఉన్నవి. వీటన్నిటిని అభివృద్ధి చేస్తూ నగర వైభవాన్ని పునరునిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర మంత్రి వర్యులు నగరాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసి, పర్యాటక కేంద్రంగా మార్చి, నగర వాసులకు బహుమతిగా, దేశ చరిత్రలో నిలిచి పోయే విధంగా, మండల ప్రజలు నిత్యం కొనియాడే విధంగా తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కిసాన్ నాయకులు నడింపల్లి యువరాజ్ మాట్లాడుతూ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయినా నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని తెలిపారు. బిజెపి మండల అధ్యక్షులు రామిశెట్టి రాజ శేఖర్ మాట్లాడుతూ రాజులు ఏలిన ఈ ప్రాంతం తరతరాలు గుర్తుండి పోయే విధంగా చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్యదర్శి సెల్వి, నాయకులు అన్నామలై, చంద్ర , రూపేష్, నాగార్జున తదితురులు పాల్గొన్నారు.