
సర్వేపల్లి ( జనస్వరం ) : తోటపల్లిగూడూరు మండలంలో అసంపూర్ణంగా ఉన్న జగనన్న లేఅఔట్లను జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సందర్శించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పేదలకి ఇళ్ల స్థలాల పేరుతో ప్రైవేటు భూములను కమీషన్ల కోసం కొనుగోలు చేసి వాటిని పూర్తిస్థాయిలో డెవలప్ చేయకుండానే పేదలకు ఇస్తే వాటిని పేదలు ఏం చేసుకుంటారు. జగనన్న లేఅవుట్లలో వసతుల కరువు ఏర్పడింది. ఏం చేయకుండానే పేదవాళ్ళకి అందించిన పరిస్థితి. వైసీపీ వాళ్లు డప్పులు కొట్టుకుంటూ జగనన్న ఊళ్లే నిర్మించమని చెప్పుకుంటున్నారు. తోటపల్లిగూడూరు మండలంలో పరిశీలిస్తే మాకు కనిపించింది జగనన్న లేఅఔట్లలో చేపలగుంటలు, కారుతుమ్మ చెట్లు, జగనన్న మందు బాటిల్ తప్ప లేఅవుట్లుగా ఒక రూపాంతరం చెందిన దాఖలాలైతే లేవు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్లలో రూ.కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రేపు 2024 ప్రజా ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తాం. ఈ కార్యక్రమంలో తోటపల్లిగూడూరు మండలాధ్యక్షుడు అంక్యం సందీప్, కోసూరు నారాయణ, శరత్, ముత్తుకూరు మండల నాయకులు అశోక్, సుమన్, వెంకటాచల మండలం కార్యదర్శి శ్రీహరి, మండల నాయకులు ఖాజా, వంశీ, తదితరులు పాల్గొన్నారు.