గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురుకుప్పం మండల కేంద్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దినపత్రికల్లో వచ్చిన వార్తపై స్పందిస్తూ తాసిల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ వెదురుకుప్పంలో భూముల క్రమబద్ధీకరణ పేరుతో రైతుల నుండి లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు నిలువు దోపిడీ చేసి ఆపై అవినీతి సొమ్మును ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హుండీలో ఎంత వేశారో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. అది తేలే వరకు ఉద్యమాన్ని ఆపేతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చే ఎన్నికల్లో ఖర్చంతా నాదే అని చెప్పడంలో వెనక ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. వెదురుకుప్పం మండలంలో నిరుపేద రైతుల వద్ద క్రమబద్ధీకరణ పేరుతో వసూలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ, దీనిలో అవినీతికి తావు లేకుండా చేస్తే నిరుపేద రైతులు బాగుపడతారని, అలా చేయకుండా డబ్బులు వసూలు చేసి నిరుపేదలైన రైతులను ఇంకా నిరుపేదలుగా చేస్తే సహించేది లేదని హెచ్చరిక చేశారు. బ్రాహ్మణపల్లి వీఆర్వో నిరుపేదల నుండి అర్జీలు స్వీకరించడం లేదని, ఎవరైనా నిరుపేదలు వస్తే వారిని పట్టించుకోవడంలేదని, ఇది సరైన పద్ధతి కాదని, వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతూ ఉంటే కూడా ఇంకా వివక్షత ఏమిటని ప్రశ్నించారు. ఒక అధికారి గ్రామపంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరిని సమభావంతో చూడాలని, సమన్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. క్రమబద్ధీకరణ వివరాలు సచివాలయం నోటీసు బోర్డులో ఉంటే సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేదని, అలాకాకుండా ఏకపక్షంగా చేయటం వల్ల అనేకమంది నిరుపేదలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసిల్దార్ ఆఫీస్ లో సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత రాత్రి 10 గంటల వరకు కూడా రాజకీయ నాయకులు అక్కడే ఉంటున్నారనేటువంటి విషయం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని, మండల తాసిల్దార్ మరియు మెజిస్ట్రేట్ ఇలాంటివి జరగకుండా చూడాలని తెలిపారు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న మండల అధికారులు సమగ్ర విచారణ జరిపి, భూమి క్రమబద్ధీకరణ పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పురుషోత్తం, తెలుగు నియోజకవర్గ యువత అధ్యక్షులు గురసాల కిషన్ చంద్, జనసేన పార్టీ యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బట్టే చాణిక్య ప్రతాప్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, జనసేన పార్టీ కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, జనసేన పార్టీ పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జిల్లా తెలుగు యువత కార్యదర్శి చంద్రబాబు రెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం బీసీ సెల్ ఉపాధ్యక్షులు శివరాం యాదవ్, సీనియర్ నాయకులు నాదముని రెడ్డి, జనసేన పార్టీ మండల కార్యదర్శి బెనర్జీ, నియోజకవర్గ టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు గంగయ్య, జనసేన పార్టీ మండల కార్యదర్శి పరంధామన్, పాతగుంట గ్రామ కమిటీ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి, జక్కదాన గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తిమ్మరాజు చిట్టెమ్మ, పాతగుంట బూత్ కన్వీనర్ షణ్ముఖ రెడ్డి, బ్రాహ్మణపల్లి బూత్ కన్వీనర్ కోదండరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కావలి చక్రి, పచ్చికాపలం బూత్ కన్వీనర్ రాజశేఖర్ వర్మ, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు సుభాన్ ఖాన్, TKM పురం బూత్ కన్వీనర్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, మురుగయ్య, వర్మ, తెల్లగుండ్లపల్లి బూత్ కన్వీనర్ గుణశేఖర్ రెడ్డి, పచ్చి బూత్ కన్వీనర్ జయరాంరెడ్డి, వేణుగోపాలపురం బూత్ కన్వీనర్ రాజగోపాల్ మరియు తిమ్మరాజు, జన సైనికులు పాల్గొన్నారు.