● ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం
● జనసేనపార్టీ సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట మండల పరిధిలోని దావాధిగుంట గ్రామంలో 32వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో సిద్ధాంతాలను ఉయ్యాల ప్రవీణ్ ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. అలాగే పార్టీ గుర్తు గాజు గ్లాసును అందరికి తెలియజేశారు. జనసేనకు ఓటు వేయడం వల్ల రాబోయే తరాలకు భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు వివరించారు. పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజలు నిలవాలన్నారు. జనసేనపార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ‘షణ్ముఖ వ్యూహం’ అమలు చేయడంతో పాటు ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయడమే జనసేన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.