Logo
Date of Publish : 20 December 2022, 4:32 pm
Editor : Sake Naresh

అవినీతి మంత్రి అంబటి రాంబాబు వెంటనే రాజీనామా చేయాలి : గుంటూరు జిల్లా జనసేన నాయకులు

     గుంటూరు, (జనస్వరం) : అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా సత్తెనపల్లి నియోజకవర్గాన్నీ మార్చి, ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి తరహాలోనే అంబటి దోచుకుంటున్నాడని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ విమర్శించారు. మంగమ్మ దంపతులను ఆదుకోవాల్సిన మంత్రి తన అనుచరులను అడ్డుపెట్టుకొని బాధితుల సొమ్మును కూడా తీసుకుంటున్నారని ఇది సత్తెనపల్లి ప్రజల దౌర్బగ్యమని అన్నారు. కౌలురైతుభరోసా సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజనామా చేస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికాడని ఇప్పుడు స్వయంగా బాధితిలే ముందుకు వచ్చి చెప్తున్నారన్నారని తక్షణమే అంబటి రాంబాబు మంత్రి పదవికి రాజీనామా చేయాలని గాదె డిమాండ్ చేశారు. సత్తెనపల్లికి చెందిన తురకా మంగమ్మ దంపతుల కుమారుడు ఓ రెస్టారెంట్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా తమ కొడుకు చనిపోయాడని ఇందుకు గాను ప్రభుత్వం నుంచి ఐదు లక్షల పరిహారం వచ్చిందని అయితే ఐదు లక్షల చెక్కు ఇవ్వాలంటే రూ.2.50 లక్షల లంచం ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావులు అడిగారని ఇది చాలా దుర్మార్గమని గాదె అన్నారు. తమ కొడుకు మృతితో వచ్చే డబ్బులతో తమ కుమార్తె పెళ్ళి చేసుకుందాం అనుకున్నామని తెలిపారు. అంబటి రాంబాబు లంచం విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించామని పవన్ వచ్చి వెళ్లిన నాటి నుంచి వైసీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. తమ కొడుకు మృతి పరిహారం చెక్కు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

• మంగమ్మ దంపతులకు ఏదైన జరిగితే అంబటి రాంబాబుదే బాధ్యత :

     తురకా మంగమ్మ దంపతులకు వెంటనే పరిహారం చెక్కు ఇవ్వాలి. సాయంత్రంలోపు ఇవ్వకపోతే ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామని అవవసరమైతే జనసేనపార్టీ నుండి ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన హెచ్చరించారు. మంగమ్మ దంపతులకు ఏదైన హానీ జరిగితే అంబటి రాంబాబుదే బాధ్యతని అన్నారు. మంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గాదె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నారదాసు ప్రసాద్, కొమ్మిశెట్టి సాంబశివరావు, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మ, మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరు రాజేష్, తుమ్మల నరసింహారావు, తన్నీరు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com