Logo
Date of Publish : 25 January 2023, 2:59 pm
Editor : Sake Naresh

జనసేన డివిజన్ పై అధికారుల అక్కసు.. దీక్షకు దిగిన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్

         విశాఖపట్నం ( జనస్వరం ) : గ్రేటర్ విశాఖ పరిధిలో జనసేన పార్టీ గెలుచుకున్న 22వ డివిజన్ పట్ల అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పార్టీ కార్పోరేటర్  పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ వద్ద దీక్షకు దిగారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు వ్యవహారంలో తన డివిజన్ ను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది  మూర్తి యాదవ్ ఆరోపణ. డివిజన్ ప్రజలు జనసేన పార్టీకి ఓటేశారన్న అక్కసుతో అధికార పార్టీ అండతో అధికారులు సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని తెలిపారు. డివిజన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలు ప్రదర్శిస్తూ దీక్ష చేపట్టారు. శాంతియుతంగా దీక్ష చేపట్టిన  మూర్తియాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి చేరుకుని సంఘీభావం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com