నెల్లూరు ( జనస్వరం ) : ఆత్మీయ పలకరింపులో భాగంగా 22వ డివిజన్ కార్యకర్త మని కుటుంబ సభ్యులను పార్టీ కి మద్దతు అడిగి ఇరుగు పొరుగున వారి తో జనసేన క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజాధనం దుర్యోగ పరుస్తూ గతంలో ఉన్న చెత్త బండ్లన్నీ చెత్తకుప్ప లో వేసి కొత్తగా తెచ్చిన 150 బండ్లు నగరంలో సరిగా తిరగడం లేదు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేయండి అని చెత్త పన్నులు వసూలు చేసిన ఈ చెత్త ప్రభుత్వం ఇప్పుడు చెత్తను సేకరించేందుకు కూడా రావడం లేదు. బండ్లకు పెట్రోల్ పట్టించలేక పోవడం. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక పోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. అవగాహన లోపంతో 150 బండి తెప్పించి ఇప్పుడు తిరిగి వెనక్కి ఇచ్చే పరిస్థితుల్లో నెల్లూరు కార్పొరేషన్ ఉంది. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రజాధనం దుర్వినియోగ చేస్తూ ఇట్లాంటి చర్యలు షరా మామూలే. కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు ఇవ్వలేదంటూ వీదికి ఎక్కే పరిస్థితి ఎదురయింది. సామాన్యులు చెత్త ఎక్కడ వేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చెత్త పన్నులు వసూలు చేసిన చెత్త ప్రభుత్వం చెత్తను తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది అని విస్మరించారు. ప్రణాళిక లోపం వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది. రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి గెలిపించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకలు కిషోర్ తో మని, శరవణ, సుబ్రమణ్యం, ప్రవీణ్,ప్రశాంత్ గౌడ్, ప్రసన్న, అలేఖ్,హరి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
One Response
Naku kriyashila sabhyathwam kavali