Logo
Date of Publish : 24 July 2026, 11:51 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు

- పొంగూరు రమాదేవి

- వీఆర్‌సీ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ 4.0
- చదువుతో పాటు పిల్లల సమగ్ర వికాసమే ప్రభుత్వ ధ్యేయం
- కార్పొరేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక వసతులు
- పిల్లల చదువుపై తల్లిదండ్రులు చూపుతున్న శ్రద్ధ అభినందనీయం
- ఉచిత బస్సు సౌకర్యం నుంచి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వరకు విద్యా రంగానికి యువనేత నారా లోకేష్ పెద్దపీట

నెల్లూరు, జూలై 24 (జనస్వరం): నెల్లూరులోని వీఆర్‌సీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ (PTM 4.0) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కలిసి విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చి పిల్లల పురోగతిని తెలుసుకోవడాన్ని ఆమె అభినందించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ, మూతపడిన వీఆర్‌సీ పాఠశాలను మంత్రి పొంగూరు నారాయణ పట్టుదలతో పునరుద్ధరించి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశారని తెలిపారు. సుమారు 1,100 మంది నిరుపేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలు అల్పాహారం చేయకుండా పాఠశాలకు వస్తే చదువుపై ఏకాగ్రత చూపలేరనే ఉద్దేశంతో ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌తో పాటు పాఠశాలకు రాకపోకల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని వివరించారు. అలాగే సాధారణ స్టడీ మెటీరియల్ అందించకుండా, నారాయణ గ్రూప్‌కు చెందిన ఆర్‌అండ్‌డీ బృందం రూపొందించిన నాణ్యమైన విద్యా సామగ్రిని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ కుటుంబ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, ప్రిన్సిపాల్ వెంకట్రావు, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, జిల్లా మార్కెటింగ్ కమిటీ సభ్యురాలు గుణుకుల విజయలక్ష్మి, బీజేపీ మహిళా నేత రాజేశ్వరి, టీడీపీ నాయకులు యశ్వంత్ రెడ్డి, డాక్టర్ పోకల రవి, సుజన్ కుమార్, దర్శి హరికృష్ణ, ఏడుకొండలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com