కరోనా కష్టకాలంలో యూజీసీ పరీక్షలు పెట్టడం సబబు కాదు... నెల్లూరు జనసేన నాయకులు గునుకుల కిషోర్
కరోనా కష్టకాలంలో ఎగ్జామ్స్ ఏమిటంటూ సింహపురి విశ్వవిద్యాలయంకి సంబంధించిన దాదాపు 200 మంది విద్యార్థులు జిల్లా కార్యాలయానికి వచ్చి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనుక్రాంత్ గారికి తమ సమస్యలను తెలియజేయవలసిందిగా అభ్యర్థించారు. జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించి మిగిలిన వారికి సమయం తీసుకుని వీలైతే నిర్వహించండి లేకపోతే ప్రమోట్ చేయండి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలు అనౌన్స్ చేయటం ద్వారా తల్లిదండ్రులు విద్యార్థులు భయాందోళనకు గురిచేసింది. గత నెలలో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు 8 మంది కరోనా సోకింది. ఎంతో వ్యయ ప్రయాసకు గురి అయి వారు వైద్యం చేయించుకున్నారు. రేపు నిర్వహించబోయే విద్యార్థులకు అందరికీ కరోనా టెస్టు నెగిటివ్ వస్తేనే ప్రవేశానికి అనుమతి కలిపిస్తారా లేకపోతే ఒకవేళ వారికి కరోనా వస్తే, వాళ్ళ వైద్య ఖర్చులు యూనివర్సిటీ వారే భరిస్తారా లేకపోతే వారికి బీమా సౌకర్యం కల్పిస్తారా తెలియ చేయవలసి ఉంది. ఎగ్జామ్స్ లేవు ప్రమోట్ అయిపోయాం తర్వాత సెమిష్టర్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇది తీవ్ర మానసిక ఒత్తిడులకు గురి చేస్తుంది. సెమిస్టర్ మొత్తం ప్రిపేర్ అయిన సిలబస్ కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చి ఎగ్జామ్స్ రాయడం రాయమని చెప్పడం సబబు కాదు. విక్రమ సింహపురి యూనివర్సిటీ కింద దాదాపు 100 కళాశాలలు ఉన్న పరిస్థితుల్లో వీరందరికీ రవాణా సౌకర్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కరోనా తీవ్రత ఇంకా తగ్గని పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నిర్వహించడం శ్రేయస్కరం కాదు కాబట్టి యూనివర్సిటీ వారు ఆలోచించి ఎగ్జామ్స్ రద్దు చేయడం లేకపోతే కనీసం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. జనసేన పార్టీ తరఫున, విద్యార్థులు,తల్లిదండ్రుల తరపున తెలియజేస్తున్నాము. వైస్ ఛాన్సలర్ గారు సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ వారంలో యూనివర్సిటీ ముట్టడి చేస్తామని కూడా గునుకుల కిషోర్ తెలియజేశారు. జనసేన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో జనసేన నాయకులు డాక్టర్ అజయ్, అంకిత, రవి, JSP యూత్ వింగ్ సభ్యులు, ప్రశాంత్ గౌడ్, శ్రీకాంత్, సుచిత్ మరియూ సిహపురి యూనివర్శిటీ విద్యార్థులు పాల్గొన్నారు.