Logo
Date of Publish : 24 January 2022, 4:26 pm
Editor : Sake Naresh

కరోనా బారిన విద్యార్థులు : కర్నూల్ జిల్లా నాయకులు పవన్ కుమార్

     కర్నూలు ( జనస్వరం ) : రాష్ర్టంలో కరోనా కేసులు రోజు రోజుకు ప్రమాదకరంగా పెరుగుతున్న ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ద లేకుండా పాఠశాలలు నిర్వహించడం వలన కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందని జనసేన పార్టీ కర్నూల్ జిల్లా నాయకులు పవన్ కుమార్ తెలిపారు. కర్నూలులో సోమవారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా కేసుల పెరుగుదల వలన పిల్లల తలితండ్రులు భయాందోళనకు గురవుతున్నారని, చాలా వరకు పాఠశాలలకు పిల్లలను పంపించడం లేదని కరోనా బారినపడి బాధపడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కనీసం తమ బిడ్డల ఆరోగ్యం విషయంలో తల్లి తండ్రులు పడుతున్న ఇబ్బందులను పరిగణించాలి. కరోనా తగ్గుముఖం పట్టే వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు, ఫీవర్ సర్వేలు చెబుతున్న విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రతి నలుగురిలో ఒకరు బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మొన్న 4 వేల కేసులు నేడు 14 వేలకు పైగా కేసులు వచ్చాయని ఇలాగే కొనసాగితే వైద్యులు ఆసుపత్రి సిబ్బంది కూడా కరోనా బారినపడితే వైద్యసేవలకు అవాంతరాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించకుండా కొనసాగిస్తే రోజువారి హాజరు సంఖ్య తగ్గుతుందని చివరకు ప్రభుత్వం ఇచ్చే అమ్మవడి పథకానికి అర్హుల కంటే అనర్హులు ఎక్కువవుతారని అందుకే సెలవులు ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారేమో అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మౌలాలి, నాగ, అనిల్, సతీష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com