విజయనగరం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన నాసేన కోసం నావంతు కార్యక్రమానికి ప్రతీ ఒక్క జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు సహకరించాలని జనసేనపార్టీ సీనయర్ నాయకులు ఆదాడ మోహనరావు కోరారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన కార్యాలయంలో శనివారం ఉదయం మీడయా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక సంకల్పంతో జనసేన పార్టీ స్థాపంచినప్పటి నుండి తన కష్టార్జితాన్ని ధారపోసి ఇటు పార్టీని పటిష్టపరుస్తూ, అటు ప్రజలకు, రైతులకు, ఆపదలో ఉన్న జనసైనికులకు, ప్రజలకు ఆర్థికంగా ఎంతో యెనలేని సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ భారతదేశంలో బహుజనుల ఆరాధ్య దైవం కాన్షీరాం తరువాత పార్టీ మరింత బలపడేందుకు, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత సేవచేసెందుకు, వారిని భాగస్వామ్యం చేసేందుకు పార్టీ విరాళాన్ని కోరిన పవన్ కళ్యాణ్ కు మనమంతా అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పది రూపాయలనుండి ఎంతైనా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన 7788040505 ఈనెంబర్ కు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ ప్రక్రియ ద్వారా సులభంగా విరాళం అందించవచ్చని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్రరాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.