Logo
Date of Publish : 07 June 2021, 3:39 pm
Editor : Sake Naresh

కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలి : ఎమ్మిగనూర్ జనసేన ఇంచార్జ్ రేఖగౌడ్

           ఎమ్మిగనూరు మాచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఆగష్టు నెలలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు మరియు అవుట్ సోర్సింగ్ విభాగంలో కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నేటికి 10 నెలలుగా వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం నుంచి కనీసం వారికి ఒకనెల జీతం కూడా అందకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయని వైద్య వృత్తిలో పనిచేస్తున్న వారి జీతాలు పెండింగులో పెట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగుల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు వినియోగించుకున్న తర్వాత వారి జీతాలు చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించేవిధంగా కృషిచేయాలని జనసేనపార్టీ అద్వర్యంలో సూపరెండేంట్ మరియు ఆసుపత్రి ఇంఛార్జీల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని 10 నెలలుగా జీతాలు చెల్లించకున్న వారి విధులు బాధ్యతతో నిర్వహించిన స్టాఫ్ నర్సులకు 10 నెలల పెండింగ్ జీతాలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి : 

మర్రిపాడు మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 మందికి అన్నదానం

 

పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాలి : జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు)

 

విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com