ఎమ్మిగనూరు మాచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఆగష్టు నెలలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు మరియు అవుట్ సోర్సింగ్ విభాగంలో కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నేటికి 10 నెలలుగా వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం నుంచి కనీసం వారికి ఒకనెల జీతం కూడా అందకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయని వైద్య వృత్తిలో పనిచేస్తున్న వారి జీతాలు పెండింగులో పెట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగుల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు వినియోగించుకున్న తర్వాత వారి జీతాలు చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించేవిధంగా కృషిచేయాలని జనసేనపార్టీ అద్వర్యంలో సూపరెండేంట్ మరియు ఆసుపత్రి ఇంఛార్జీల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని 10 నెలలుగా జీతాలు చెల్లించకున్న వారి విధులు బాధ్యతతో నిర్వహించిన స్టాఫ్ నర్సులకు 10 నెలల పెండింగ్ జీతాలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com