పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రముఖ వైద్యుడు, జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. పిఠాపురం విష్ణు హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శక్తికొలది సేవా కార్యక్రమాలు చేయమని పిలుపు ఇచ్చారని, భవిష్యత్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. సిద్ధార్ధ వాలంటరీ బ్లడ్ బ్యాంకు, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 100మందికి పైగా రక్తదానం చేశారు. వారందరికీ జ్యూస్, పండ్లు అందజేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందించారు. తొలుత జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొని డాక్టర్ శ్రీధర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కట్ చేయించి ఆయన చేతితో తినిపించారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి, దేవుని ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, సాయిప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన నాయకులు పిల్లా శివ, జ్యోతుల శ్రీనివాస్, జనసేన నాయకులు మాదేపల్లి శ్రీను, సారిపల్లి నాగేశ్వరరావు, నక్కా బద్రి, అడపా శివరామకృష్ణ, జ్యోతుల సతీష్, దొడ్డి నాగబాబు, కంబాల దాసు, దొడ్డిపట్ల బాబులు, వీరమహిళలు, అధిక సంఖ్యలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.