Logo
Date of Publish : 25 October 2021, 8:37 am
Editor : Sake Naresh

శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి : జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశములో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

    హైదరాబాద్, (జనస్వరం) : జనసేన పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారి నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి కనీసం మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అప్పుడే శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారాన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చింది. శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా, మండల స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బ తిని ఉన్న ఒక రోడ్డుకు మరమ్మతు చేయాలని సూచించారు. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్‌ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది మన పార్టీ లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్‌ సిద్ధం చేస్తున్నాం. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తాను” అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారు మాట్లాడుతూ "పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకొంటూ మన అధ్యక్షుల వారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించాలి. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాలని చెప్పారు. పార్టీ మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com