పవన్ కళ్యాణ్ బీజేపీ సంబంధాలు రెండు రాజకీయ పార్టీలు ప్రజలకు ఉపయోగపడేలా ఎలా పని చేయొచ్చు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ. కలిసి పోటీ చేసాం కదా అని సాగిలపడకుండా తప్పులు ప్రశ్నించి ప్రజలకు ఉపయోగపడే అనేక పరిష్కారాలు సాధించిన కూటమి. బీజేపీపై పవన్ ద్విముఖ వ్యూహంతో పని చేసాడు. దిక్కరణ చూసాం, సయోధ్య చూసాం..
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పాచిపోయిన లడ్డులు అని నిర్మొహమాటంగా విభేదించాడు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటు కి వ్యతిరేకంగా గళం వినిపించాడు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కేంద్రం ఆలోచన మార్చుకునేలా పోరాటం చేసాడు. DCIని సంపూర్ణంగా ప్రైవేట్ పరం చేద్దామనుకున్న నిర్ణయంనుండి కేంద్రం వెనక్కి వెళ్లడం కేవలం పవన్ కళ్యాణ్ కృషి ఫలితం. ప్రైవేటైజ్ చేద్దాం అని నిర్ణయం తీసుకున్న తదుపరి కాబినెట్లోనే డీసీఐకి 20 కోట్లు కేటాయించి తమ నిర్ణయం మార్చుకున్నట్లు చేతలతో చెప్పడం జరిగింది. రోహిత్ వేముల ఆత్మహత్య గురించి మానవతా కోణం తీసుకుని బీజేపీ అతివాదుల పై ప్రశ్నలు సంధించాడు. Cow slaughter లో బీజేపీ సైద్ధాంతిక లోపాలు, విభిన్న ప్రాంతాల్లో ఉన్న వైరుద్యాలు గురించి విడమరచి ప్రశ్నలు సంధించాడు. నోట్ల రద్దు సమయంలో ప్రజలు ఇబ్బందులను ఎత్తి చూపించాడు. పొత్తులో ఉన్నాం కదా అని సిద్ధాంతాలు, విధానాలపై ఎక్కడా కంప్రమైస్ కాలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు గుర్తు చేశాను. మంచి అయితే మద్దతు, తప్పు అయితే ఎందాకైనా పోరాడటం పవన్ కళ్యాణ్ రాజకీయ పందాగా సాగుతుంది. పవన్ చేసిన ప్రతీ పోరాటంలోనూ స్వార్ధం లేకుండా నిజాయితీ ఉంది కాబట్టి ప్రధాని సైతం Mera Saath Pawan Hai అని అన్నారు.
పవన్ పోరాడటంలో నిజాయితీ ఉంది, పొత్తులో నీతి ఉంది.
ఇక నాలుగో వదిన జగన్ దగ్గరికి వద్దాం.
నువ్వు సీఎం అయితే ఏంట్రా. నొక్కితే నొక్కించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి అనే పరిస్థితి. బిల్లు ఏదైనా నోరు మూసుకుని మద్దతు తెలపాలి. కేంద్రం తప్పు చేసినా అడిగితే లోపలికి వెళ్ళిపోతాను అనే కుక్క బ్రతుకు. కేసులు ఉన్నాయి కాబట్టి జగన్ వంగి వంగి నమస్కారం పెట్టి ప్రతి బిల్లుకు మద్దతు చెప్పాడు. అందుకే పెద్దలు అన్నారు జగన్లా సిగ్గులేకుండా అధికారంలో ఉండి ప్రజలతో చీకొట్టించుకునేకంటే, పవన్ కళ్యాణ్ లాగా గౌరవంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల మన్ననలతో అధికారంలోకి రావాలి అని....
మీ
ట్విట్టర్ (X) : @Teluguchegu
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com