Search
Close this search box.
Search
Close this search box.

వైకుంఠపురం బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి : కావలి సిద్దు

కావలి సిద్దు

          కావలి ( జనస్వరం ) : పేదలు నివసించే వైకుంఠపురం పట్ల పాలకులు, అధికారులు చిన్నచూపు, నిర్లక్ష్య ధోరణి, మొద్దు నిద్రను మేలు కొల్పేందుకు జనసేన జలదీక్ష చేస్తున్నాం చేస్తున్నామని జనసేన నాయకుడు సిద్దు తెలిపారు. గత పది సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైకుంఠపురం, పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ, నార్త్ జంతాపేట వాసులు రైల్వే ట్రాక్ పై నడుస్తూ పడుతున్న బాధలు మీకు కానరావడం లేదా. ట్రాక్ దాటుతూ రైళ్ళు గుద్దుకుని వృద్దులు, దివ్యాంగులు గత పది సంవత్సరాలుగా 20 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతే మీలో చలనం వస్తుందని ప్రశ్నిస్తున్నా. రైల్వే ట్రాక్ దాటలేక పట్టణంలోకి వచ్చేందుకు ఆటోల బాడుగలు కట్టలేక పేదలు ఎంతో అల్లాడుతున్నారు. నెలకు ఒక్కొక్క ఇంటికి సరాసరి 2వేల పైనే భారం పడుతుంది. ఈ భారం ఎవరు భరించాలి? మురికి నీరు పోయే తూములో బాట చూపించి ఏదో ఘనకార్యం చేసినట్లు చంకలు గుద్దుకుంటు న్నారు. ఆ మురుగు నీళ్ళల్లో విద్యార్థులు, మహిళలు పడే బాధలు మీకు పట్టడం లేదన్నారు. 
       అనపగుంటను పార్కుగా చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఏమయ్యింది. పిచ్చి మొక్కలు, నాచు, వ్యర్థాలతో అనపగుంట అధ్వానంగా ఉంటే మున్సిపల్ అధికారులు ఏమి చేశారు. వర్షాలు కురువక ముందే అనపగుంటలో పూడిక ఎందుకు తీయలేదు. ఈ రోజు అనపగుంట సర్వ రోగాల ఉత్పత్తి కేంద్రంగా మారింది. హానికర దోమలన్నీ ఇక్కడే పెరుగుతున్నాయి. చేపలు,. మామసం వ్యర్థాలతో ఇటుగా వెళ్ళే వారికి కుళ్ళు కంపు కొడుతోంది. ఈ గుంటలో నుంచి పారే నీళ్ళల్లో అందరూ నడిచి పోయే ఖర్మ దాపురించింది. రైల్వే అధికారులు వంతెన కింద పీడబ్ల్యూ ఐ యూనిట్, ఓహెచ్ఇ షెడ్డు నిర్మాణం చేసుకుని బ్రిడ్జి కింద రాకపోకలు నిషేదిస్తున్నారు. తూముకు ఎదురుగా బాట వేసుకోవాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ బాట కూడా వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మన మున్సిపాలిటీకి ఉందా..? ఈ సమస్యను చూసేందుకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పాత బిల్డింగులు ఎక్కడన్నా పడేస్తే ఆ వేస్ట్ మెటీరియల్ తోలించి బాట వేస్తా అని చెప్పడం సిగ్గుచేటుగా అనిపించలేదా.? ఎక్కడైనా ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి ఎస్టిమేట్ వేయించి యుద్ధప్రాతిపదికన రోడ్డు వేస్తారు. అసలు పాత బిల్డింగుల మెటీరియల్ తోలడం ఏమిటి..? ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తూ కావలి పట్టణంలో మీకు తెలియకుండా చీమకూడా దూరడానికి లేదు. అసలు మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో తెలుసా, తెలియనట్లు నటిస్తున్నారా? వైకుంఠపురం వాసులు మిమ్మల్ని నమ్మి రెండు సార్లు భారీ మెజార్టీ ఓట్లు వేశారు. కానీ వారికి మీరు ఏమి న్యాయం చేస్తున్నారు. ఒక్క రోడన్నా బాగుందా..? కాలువలు ఉన్నాయా..? పాపం ఇక్కడ బాగా పనిచేసే మాజీ కౌన్సిలర్లు మాల్యాద్రి గారు, పుల్లయ్య గార్లు ఉన్నారు. రోడ్లు, కాలువలు కావాలని వారు బతిమాలుతున్నా ఎందుకు కనికరించం లేదయ్యా.. ఇప్పటికైనా వెంటనే ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు బ్రిడ్జి నిర్మాణం, అనపగుంటకు శాశ్వత పరిష్కారం, వైకుంఠపురంలో సదుపాయాలు కల్పించాలని జనసేన తరుపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి, పసుపులేటి సురేష్, తోట సాయి, మనోజ్ కుమార్, జోషి, రమేష్, విజయ్, విష్ణు, చక్రి మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way