నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 133వ రోజున 50వ డివిజన్ కటారిపాళెం ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ కటారిపాళెంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ మంజూరైందని, పిల్లర్లు కూడా వేసి ఉన్నారని, కానీ నేటికీ నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ నిధులను ఉచితాలకు మళ్లించకుండా ఉండుంటే ఈపాటికి చక్కటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటై ఉండేదని, కానీ వైసీపీ అధికారంలోకి రావడమే ప్రజల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా త్వరితగతిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో తాము ఎమ్మెల్యే అయిన తర్వాత వైసీపీ వైఫల్యాన్ని ఇంటింటికీ దండోరా వేయించి మరీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని అత్యాధునికంగా ఉండేలా పూర్తి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.