
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం మధుపం గ్రామంలో జనసైనికులు ఆర్థిక సహకారంతో ఒక పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర గారు, పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్య గారు, రాష్ట్ర బూత్ కమిటీ సభ్యులు వన్నె రెడ్డి సతీష్ కుమార్ గారు, ఉత్తరాంధ్ర జనసేన బిజెపి సమన్వయ సభ్యులు రామ్మోహన్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జి. సిగడాం మండల జెడ్పిటిసి అభ్యర్థి భూపతి అర్జున గారి ఆధ్వర్యంలో శివశంకర్ గారి చేతుల మీదగా ఆ గృహానికి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. బొలిశెట్టి సత్య గారు, సతీష్ గారు రామ్మోహన్ గారు కొబ్బరికాయ కొట్టి ఆ కుటుంబాన్ని ఆ నూతన గృహంలో కి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు, రెడ్డి భాస్కర్ గారు, రామారావు గారు, బొంతు విజయ్ కృష్ణ గారు, వడ్డేపల్లి శ్రీను గారు, మధు బాబు గారు, మీసాల రామకృష్ణ గారు ,రామరాజు గారు, నాయుడు గారు, తాళాబత్తుల పైడి రాజు గారు, మండల జడ్పిటిసి అభ్యర్థి తమ్మినేని శ్రీను గారు తదితర మండల నాయకులు కార్యకర్తలు ఆ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అనంతరం రామతీర్థం క్షేత్రాన్ని జనసేన పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది.