ఇచ్చాపురం ( జనస్వరం ) : బహుదనది పైన వంతెన నిర్మించడం కోసం SE జాన్ సుధాకర్, EEp. సత్యనారాయణ DES. రామి నాయుడు రావడంతో జనసేన ఇచ్చాపురం ఇంచార్జి దాసరి రాజు వాళ్ళని కలిశారు. అక్కడ వంతెన కోసం సోయిల్ చెక్ చేసి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక వంతెన నిర్మించి 2 వీలర్స్, 3 వీలర్స్ వెహికిల్ వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తామని తెలిపారు. జులై మొదటివారం నుండి అనుమతి ఇస్తాం అని చెప్పడం జరిగింది. పూర్తి వంతెన నిర్మించడం కోసం ప్రభుత్యానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మొదటినుండి జనసేన వంతెన కోసం చాలా ప్రయత్నం చేసింది. ఇది జనసేన విజయంగా భావిస్తున్నామని అన్నారు. ఇలానే ప్రజల తరపున సమస్యల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఆ రోజు వంతెన కూలిన రోజు నుండి ఈ రోజు వరకు అలుపెరుగని పోరాటం జనసేన పార్టీ చేసిందన్నారు. పూర్తి వంతెన కోసం కూడా యుద్ధప్రాతిపదికన పనులు జరగాలి అని కోరారు.