పాలకొల్లు ( జనస్వరం ) : కొంతేరు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని యల్. పి. యఫ్ చైర్మన్, దళిత నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆనాడు మహానుభావుడు డా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈనాడు మేము స్వేచ్ఛగా బతికే అవకాశం ఉండేది కాదని ఇప్పటికి ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు కిందివరకు చేరడం లేదని కొందరు రాజకీయ నాయకులు దళితులను ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుంటున్నారని రాజకీయంగా మరిన్ని గొంతులు లేవాలని అణచబడిన వర్గాల కోసం మాట్లాడాలని కోరారు కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అణచబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లపుడు అందరు కలసి కృషి చేసి అంబేద్కర్ గారి ఆశయసాదకులుగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నమట్ల శివాజీ, రావి నవీన్ కుమార్, నేతల నవీన్,గూటం ప్రేమ్ చంద్, పాలపర్తి వెంకట నర్సయ్య, ఉన్నమట్ల కిషోర్, పెదపాటి కళ్యాణ్, ఉన్నమట్ల జగపతి, పాలపర్తి చిట్టిరాజు, ఉన్నమట్ల సునీల్, చుట్టుగుళ్ల ప్రభాష్, పాలపర్తి శ్రీను, నేతల కార్తిక్ , తెన్నేటి చంటి, పెదపాటి ఆశిష్, విజయ్ పాల్గొన్నారు.