నాగర్ కర్నూలు ( జనస్వరం ) : బిజినపల్లి మండలం అల్లిపుర్ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో కలిసి, జనసైనికులతో కలిసి, పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు. దీంట్లో భాగంగా ప్రజలు వారి సమస్యలను వంగ లక్ష్మణ్ గౌడ్ గారికి విన్నవించుకున్నారు. ఎమ్మేల్యే గారికి మా అల్లిపుర్ గ్రామం కేవలం ఓట్ల సమయంలోనే కనిపిస్తుందా.? ఓట్ల కోసం మాత్రం మా గ్రామంలో ప్రతి విధి, విధి తిరిగి, ప్రతి గడప తిరిగి ఓటేయండి, మీకు ఇల్లు ఇస్తం, పించన్ ఇస్తాం, అన్ని కబుర్లు చెప్పారు... ఇప్పుడెక్కడ పోయింరు ..? మా గ్రామంలో రోడ్లు సరిగ్గా లేవు, మోరిలు లేవు, చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళ మధ్య కాల్వలు లేవు, రోడ్లు అన్ని గుంతలు మిట్టలు... ఎందుకీ పాలన .. ఎందుకీ వేదన ?? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వంగ లక్ష్మణ్ గౌడ్ గారితో గ్రామస్థులు ప్రభుత్వంపై, నియోజకవర్గ పాలనపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మార్పు మీ నుంచే మొదలవ్వాలి అని కోరుకుంటున్నాం అంటూ ప్రజలు వంగ లక్ష్మణ్ గౌడ్ గారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు జస్టిన్ బాబా, భోట్కా రమేష్, మూర్తి నాయక్, రాజు నాయక్, వంశీ రెడ్డి, సూర్య, లింగం నాయక్, రాకేష్, రమేష్, స్వామి, పవన్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com