
చీపురుపల్లి, (జనస్వరం) : ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన జమ్ము ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో, సుంకు వెంకటేశ్వరరావు అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, చీపురుపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.