– పార్టీ జండాలతో, నాయకుల పేర్లతో జేజేలు..
– అమ్మవారు క్షమించరు.. అన్ని చూస్తేనే ఉంటారు..
– జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్
జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి రెండు సంవత్సరాలుకి ఒకసారి జరిగే పెనుగంచిప్రోలు అమ్మవారి రంగుల మహోత్సవ కార్యక్రమంలో ఈ ఏడాది రాజకీయం అంటుకుంది, అంటించారు. మరి దీనిని జనసేన పార్టీ తరుపున ఒక సామాన్య భక్తునిగా, అమ్మవారి భక్తుల తరుపున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని మీడియా ముఖంగా ఈమని కిషోర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి రంగుల మహోత్సవ కార్యక్రమంలో ఎదో సినిమాకి సంబంధించిన ఎడ్లు వచ్చాయని ఇదే అవకాశంగా తీసుకుని కొంత మంది టీడీపీ కార్యకర్తలు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని వారి పార్టీ జండాలతో పార్టీ నాయకుల పేర్లు పెట్టి జేజేలు కొట్టారు అని, మరి దీన్ని చూసి మేము ఏమైనా తక్కువ అని అధికార పార్టీ వారు కూడా వారి జండాలతో వీరి లాగానే ప్రవర్తించడం మొదలు పెట్టారు అని, దీన్ని చూస్తున్న భక్తులు తీవ్ర అసహనానికి గురి అయ్యారు అని, అదే విధంగా అమ్మవారి రంగుల మహోత్సవాన్ని కూడా అవమాన పరిచారని, అమ్మ అన్ని చూస్తూ ఉంటుందని మూల్యం తప్పక చెల్లించుకుంటారని ఆయన తెలిపారు. ఆలయ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగు చర్యలు తీసుకుని కట్టడి చేయటంలో విఫలం అయ్యారని, స్థానికంగా ఉన్న నాయకులు ఉదయభాను, తాతయ్య వారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మీ కార్యకర్తలకు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని, మరి తిరుగు ప్రయాణంలో అయిన సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, మేల తాలలతో సాగనాంపవల్సినదిగా ఆలయ అధికారులను, పొలిస్ వారిని కోరుచున్నాము అని ఆయన తెలిపారు.