జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ తాటంశెట్టి నాగేంద్ర గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన శుభ సందర్బంగా చిట్వేలి జనసేన పార్టీ మండల జనసైనికులు తరఫున మాదాసు నరసింహులు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీలో చురుకైన కార్యకర్తగా అంకిత భావంతో పనిచేసే శ్రీ నాగేంద్ర గారికి ఈ కొత్త బాధ్యతలు అందించినందుకు ముందుగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగేంద్ర గారు రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ, అధినేత ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. శ్రీ తాటంశెట్టి నాగేంద్ర గారు పార్టీ లో మరింతగా ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ మరోసారి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com