
చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి ఎం. నాసీర్ మాట్లాడుతూ 30 రోజుల పాటు ఎంతో క్లిష్టమయినా సరే సహనం, నిష్ఠతో ఉపవాసం ఉంటూ చివరగా ప్రతి ముస్లిం రంజాన్ పండుగను ఎంతో ఉల్లాసంతో జరుపుకుంటారు. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమయినదని అన్నారు. అటువంటి రంజాన్ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా 10 వ తరగతి పరీక్షలు నిర్వహించబడును అని సర్కులర్ రిలీజ్ చేయడం ఎంతో సిగ్గుచేటు, ఇది ముస్లింల హక్కులను కాలేద్రోయటమే అని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వంలో మైనారిటీ లను ఒక ఓటర్ గానే చూస్తున్నారు, ముస్లింలకు ఎంతో ప్రత్యేకమయిన రంజాన్ రోజున నిర్వహిస్తున్న 10 వ తరగతి పరీక్షను వాయిదా వేయాల్సిందిగా జనసేన పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు.