Logo
Date of Publish : 18 August 2023, 8:08 pm
Editor : Sake Naresh

మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

        విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం లో పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శుక్రవారం నాటికి ఈ కార్యక్రమం 84వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా 39 వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పెర్రి వీధిలో మృతి చెందిన సీతమ్మ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆర్థికంగా సహాయం అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. వైసిపి పాలన పోవాలి, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి అనే నినాదం ప్రజల్లో ఉందన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో అధికార మార్పు జరగడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తాము ప్రజలకు మంచి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా పట్టిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జీవీ నారాయణరెడ్డి, పద్మ ,లలిత , దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com