Logo
Date of Publish : 24 November 2020, 3:35 pm
Editor : Sake Naresh

విశాఖలో జనసేన ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల ఆందోళన

విశాఖలో జనసేన ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల ఆందోళన

                   విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన నిర్వహించారు. మహిళా గ్రూపు సభ్యులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వైయస్సార్ ఆసరా పథకం జమ కాలేదంటూ నిరసన చేపట్టారు. దీనిపై ఇప్పటికే అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని జనసేన నేతలు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందడం లేదని అన్నారు. వీటిని అమలుచేయడంలో ఆయా వాలంటీర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా గ్రూపు సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరుకు వినతిపత్రం అందించారు.అన్ని అర్హతలు ఉన్నా వైయస్సార్ ఆసరా పథకం అందలేదని ఆరోపిస్తూ విశాఖ జిల్లా చెట్టుపల్లిలో డ్వాక్రా మహిళలు ఆందోళన నిర్వహించారు. జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందడంలేదని జనసేన నేతలు అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com