అరకు ( జనస్వరం ) : జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు పత్రికాముఖంగా మాట్లాడుతూ రేషన్ కార్డు పింఛన్లు తొలగింపు పై గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజల పట్ల గంటకో మాట పూటకో మాటగా గిరిజనుల జీవోల మీద, చట్టాల మీద, కులాల మీద ప్రభుత్వా తీరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఏ క్షణం తొలిగిస్తారో బిక్కు బిక్కుమంటున్న గిరిజనులు ఇప్పటికే నిత్యావసర సరుకుల రేట్లతో సతమతమవుతున్నారు. సర్వేల పేరుతో, జీవోల పేరుతో, భూముల పేరుతో రేషన్ కార్డులు మరియు పింఛన్లు తీసేస్తున్నారు. తొలగించిన ఫించన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతంత మాత్రంగా బతికే గిరిజనులకు చెత్తపన్ను, ఇంటిపన్ను వెంటనే రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వ తీరు మార్చుకోవాలని లేని పక్షాన జనసేనపార్టీ పార్టీ తరుపున భారీ ఉద్యమం చేస్తామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com