అనంతపురం ( జనస్వరం ) : సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించమని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేలమంది సమ్మె చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో దాదాపు 1850 మంది డిసెంబర్ 20 నుండి నిరవధిక సమ్మె చేస్తున్న వైసిపి ప్రభుత్వం ముద్దు నిద్ర లేవడం లేదు. తక్షణమే సమగ్ర శిక్ష కాంటాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ న్యాయమైన డిమాండ్లను యుద్ధ ప్రాతిపదిక పైన పరిష్కరించాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి అన్నారు. సమగ్రశిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలనం చేసి, రెగ్యులర్ చేయాలి.సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ HR పాలసీ అమలు చేయాలి. గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. అందరికీ మినిమం ఆఫ్ టైం స్కేల్ +HRA +DA అమలు చేసి వేతనాలు పెంచాలి. ప్రస్తుతమున్న పార్ట్ టైమ్ విధానాన్ని రద్దుచేసి, ఫుల్ టైమ్ కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలి. ఔట్సోర్సింగ్ సిబ్బందికి కాంటాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలి. సమగ్రశిక్ష కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు. అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫున సమగ్ర శిక్ష కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జిల్లా నాయకులు పాలగిరి చరణ్ తేజ్, మెరుగు శ్రీనివాస్ మరియు తదితర నాయకులు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com