పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స. పుండరీకం మాట్లాడుతూ పేర్ని నాని పవన్ కళ్యాణ్ ని విమర్శిచే ముందు నిన్ను నీవు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. పేర్ని నాని నాలుగేళ్ళ వైస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ప్రస్తుత ఎం. యల్. ఏ గా మచిలీపట్నం అభివృద్ధి చేయటంలో విఫలం అయ్యావు. నీవా పవన్ కళ్యాణ్ విమరిస్తున్నావు. పేర్ని నాని నీవు బండారు పోర్ట్ నిర్మాణానికి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ రెడ్డితో కలిసి మూడుసార్లు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఎందుకు బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేయలేదు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు అని మత్స.పుండరీకం అన్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడడానికే పేర్ని నాని వెంపర్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బందరు ఓటర్లు పేర్ని నాని చెప్పులు చూపించేందు సిద్ధంగా ఉన్నారని పుండరీకం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రని అడ్డుకునేదుoకు మీ వైస్సార్సీపీ ప్రభుత్వం చీకటి జి.ఓ (సెక్షన్ 30 ) లు తెస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటానికా పవన్ కళ్యాణ్ ముందువుంటారు. వైస్సార్సీపీ నీచ, దుష్ట, అవినీతి, అక్రమ పాలకు అంతిమ యాత్రకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లక్ష్యంగా జనసేన వారాహి విజయ యాత్ర కొనసాగుతుంది అని మత్స.పుండరీకం అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com