మహిళాజాతిపై జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై జనసేనపార్టీ మహిళా విభాగం తరుపున ఎస్పీ గారికి ఫిర్యాదు
సోషల్ మీడియా లో దీపిక కడారి అనే మహిళ చేసిన అసందర్భ వాక్యాలుకు గాను మరియు తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా మహిళాజాతిపై జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై జనసేనపార్టీ మహిళావిభాగం తరుపున ex-మేయర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారు మర్యాదపూర్వకంగా SP గారిని కలిశారు. అలాగే వీరమహిళలు జయ లక్ష్మి ముత్యాల, కృష్ణవేణి సుంకర, రమ్య జ్యోతి పిల్లా, జ్యోతి దాలే, కాశీ రాణి గార్లతో జిల్లా SP గారికి వినతి పత్రం అందించి, పోలీస్ వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ తరుపున సరోజ గారు కోరారు. అలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో మేము కూడా మీరు చేసే కార్యక్రమాలకు వీరమహిళల తరువున మా వంతు సహకారం అందిస్తాం అని తెలియజేసారు. SP గారు సానుకూలంగా స్పందించి సత్వరమే పటిష్ట చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు అని ex-మేయర్ సరోజ గారు తెలియజేశారు.