తిరుపతి ( జనస్వరం ) : టీటీడీ వెబ్ సైట్ లో దర్శనం, గదులు బుక్ చేసుకున్న భక్తులకు షాక్ తగులుతోందని, దర్శన టికెట్లకు తీసుకోవాల్సిన డబ్బులకంటే అధికంగా వసూలు చేస్తున్నారని, టీటీడీ జీఎస్టీ పరిధిలో ఉందా? జగన్ ట్యాక్స్ పరిధిలో ఉందా? అంటూ ఇలాంటి దొంగ వెబ్సైట్లలోనే కాకుండా, అఫీషియల్ టీటీడీ వెబ్ సైట్లలో మోసాలు జరగటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టి, కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని, ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని, భక్తుల నుండి అధిక వసూళ్లలో టీటీడీ పాలకమండలి హస్తమేమైనా ఉందా అని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దీనిపై ఏం సమాధానం చెబుతారో తెలియజేయాలని, టీటీడీ కేసులు పెట్టడం, మంత్రులతో సిఫార్సులు చేయించుకోవడం మానుకుని భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ శనివారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, రాజ మోహన్, కిషోర్, మనోజ్, రమేష్ కుమార్, విజయ రెడ్డి, రెడ్డి ప్రసాద్, సాయి దేవ్, ఆది కేశవులు, జయరెడ్డి, లావణ్య, వందనలతో కలిసి టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.