అనకాపల్లి ( జనస్వరం ) : మడుతూరు గ్రామంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న త్రాగు నీరు, డ్రైనేజీలు కోసం జనసేన పార్టీ వీరమహిళ మోటూరు శ్రీవేణి స్పందనలో ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడుతూరు గ్రామంలో మంచి నీటిసరఫరా 5 రోజులకు ఒక్కసారిగా జరుగుతుంది. దీనితో ప్రజలు ఐదు రోజులకు ఒక్కసారిగా ఆ నీటి నిపట్టుకొని నిల్వచేసుకొని త్రాగుతున్నారు. ఈ నిల్వ నీరు కారణంగా గ్రామంలో అనేక మంది కిడ్నీవ్యాధులకు గురి అవుతున్నారు. ఇప్పటికే అనేక మంది డయాలసిస్ వరకు వెళ్ళి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది డయాలసిస్ తో కాలం గడుపుతున్నారు. గ్రామంలో గల శెట్టిబలిజ కాలనీలో సుమారుగా 100కుపైగా కుటుంబాలకు పంచాయతీ నుండి మంచి నీటి సరఫరా లేదు. ఆ కుటుంబాలకు చెందిన వారంతా దినసరి కూలీలుగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారంతా మంచి నీటి కొరకు గ్రామంలో నీటి సరఫరా జరిగే వేరే ప్రాంతాలకు పోయి నీటి ని తెచ్చుకునే పరిస్థితి ఆ కాలనీలో ఉంది. వారంతా పనినిమిత్తం పక్కనున్న కంపెనీలకు పోయేటప్పడు A షిప్టు డ్యూటీలకు పోయే క్రమంలో ఆసమయంలో మంచి నీటి సరఫరా లేక పోవడంతో వారు డ్యూటీల నుండి తిరిగి వచ్చే సమయానికి వేరే ప్రాంతాల్లో కూడా మంచి నీటి సరఫరా లేక పోవడంతో చాలా ఇబ్బందులుకు గురవుతున్నారు. తమరు ఆకుటుంబాలకు నిత్యం మంచి నీటిని సరఫరా చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అదే విధంగా శెట్టిబలిజ కాలనీతో పాటుగా గ్రామ సచివాలయానికి ఆనుకొని ఉన్న బిసి కాలనీలో మంచి నీటి సరఫరాతో పాటుగా డ్రైనేజీలు లేక పోవడం మురుగు నీరు పోయే అవకాశం లేకపోవడంతో ఆ కాలనీ వాసులంతా అనేక ఇబ్బందులు పడుతూ తరుచు అనారోగ్యాలూ పాలవుతున్నారు. హరిజన కాలనీలో డ్రైనేజీలు లేక మురుగు నీరు పోకపోవడంతో ప్రజలంతా అనేక ఆరోగ్యసమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తమరు ఆ కాలనీకి డ్రైనేజీలు నిర్మాణాలకు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నామని అన్నారు.