నెల్లూరు ( జనస్వరం ) : విద్యుత్ మీటర్ల పై డోర్ వేయకుండా అజాగ్రత్తగా వదీలు వేయడం వలన అల్లీపురం,టిడ్ కో ఇళ్ల వద్ద మరణించిన బాలుడు కుటుంబ సభ్యులను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ పరామర్శించారు.ఇల్లు ఇచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా మమ్మల్ని కనీసం చూడడానికైనా రాలేదంటూ తమ సమస్యలు స్థానికులు వివరించారు. నగర అభివృద్ధిలో భాగంగా 20 సంవత్సరాలుగా నగరంలో ఉన్న వారిని ఖాళీ చేయించి ఈ ప్రాంతంలో చేర్పించారు కానీ వారి బాగగులు చూడటంలో నగర ఎమ్మెల్యే విఫలమయ్యారు. సంవత్సరం గడిచినా కూడా నరకయాతన అనుభవిస్తున్నా వారిని పట్టించుకునే దిక్కేలేరు. కరెంట్ వైరు ఓపెన్ కనెక్షన్ మీటర్ వైరింగ్ అజాగ్రత్తగా ఉండటం.మీటర్ల డోర్ వేయకపోవడం వలన ఒక ప్రాణం నష్టం జరిగింది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధితులకు నష్ట పరిహారం అందజేయాలి. పూర్తి పనులు జరగడం జరగకపోవడం వలన డ్రైనేజీ నిండినప్పుడల్లా బయటకి వెళ్లే దారి లేక ఇళ్లలో బాత్రూంలో నుంచి బయటకు వచ్చి వారానికి ఒకసారి ఇంటినిండా మరుగు బయటకు వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గోడలన్నీ ఎర్త్ అవుతున్నాయి,వానపడితే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి, చినుకు పడితే బాల్కనీ నిండిపోయి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. చెత్త చెదారం బయటికి వేసే పరిస్థితి లేదు ,ఇంటి చుట్టూ చెత్త,చెదారం,దుర్వాసనదోమలు,పాములు,విష జ్వరాలు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి వెళ్లాలన్నా రోడ్డు,రవాణక సౌకర్యం లేదు, ఇళ్ళ నుంచి వచ్చే మరుగు గుంట క్లీన్ చేయకపోవడం వల్ల మరుగు బయటకు వెళ్లే దారి లేక దాని నుంచి వచ్చే దుర్గంధానికి తిండి కూడ తినలేకుండున్నారు. సాయంత్రం దాటితే బయటినుంచి ఇక్కడికి రావాలన్నా,ఇక్కడి నుంచి బయటికి పోవాల్నా మహిళలు చిన్నపిల్లలు భయాందోలనలకు గురి అవుతున్నారు,చుట్టూ చీకటి,అల్లరి మూకలు ఆగడాలు తాగి,అసాంఘిక కార్యక్రమాలకు నెలవగా ఈ ప్రాంతం తయారైంది. ఇల్లు ఇచ్చారా అంతటితో వదిలించుకున్నా? అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దాదాపు 30 కుటుంబాల ఇళ్లకు మౌలిక వసతులు కల్పనకు అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని మెరుగుపరచే వరకు కూడా జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతాము.ఓట్లు వేసి గెలిపించిన నగర ఓటర్లును నిర్లక్ష్యం చేయటం తగదు సిటీ ఎమ్మెల్యే… ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకలు కిషోర్ తో పాటు జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్,ఖలీల్,కేశవ, వర తదితరులు పాల్గొన్నారు..