Logo
Date of Publish : 29 September 2022, 1:55 pm
Editor : Sake Naresh

భూమి కోల్పోయిన రైతలకు నష్టరిహారాన్ని తక్షణమే చెల్లించాలి : దంతులూరి రామచంద్ర రాజు

  • పోలవరం ప్రాజెక్టు కాలువ వలన భూమి కోల్పోయిన రైతలకు ఎకరాకు 40 లక్షలు నష్టరిహారాన్ని చెల్లించాలి
  • తోటపల్లి నీరు తక్షణమే విడుదల చేసి చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గం రైతులను ఆదుకోవాలి
  • రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన తరుపున పోరాటం చేస్తామని తెలిపిన నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్ర రాజు

      విజయనగరం ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గం,గుర్ల మండలంలో కొండగండ్రెడు, ముద్దాడ పేట, పల్ల పేట, పతిగిరి గిట్లలో, పోలవరం ప్రాజెక్టు సుజలధార కాలువ వలన భూమి సుమారు 180 ఏకరాలు భూమిని రైతులు కోల్పోయి, ప్రభుత్వంనష్టపరిహారంచెల్లించకుండా, రైతులుకష్టాల్లో ఉండగా.. రైతులకు అండగా నిలుస్తామని గురువారం ఉదయం ఆయా గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు రైతులతో సమావేశాలు నిర్వహించి, రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించే వరకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈసందర్భగా నాయకులు రామచంద్ర రాజు, ఆదాడ మోహనరావు మాట్లాడుతూ సుజలధార కాలువ ద్వారా భూమికోల్పోయిన రైతులకు ఏకరాకు 40 లక్షలు నష్టరిహారాన్ని ఇవ్వాలని, అలాగే తోటపల్లి నీరును తక్షణమే విడుదల చేసి, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి, రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన తరుపున పోరాటం చేస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com