
లావేరు, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లాలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మొక్కజొన్న, ఇతర పంటలు పూర్తిగా నాశనం అయిపోయాని మొక్కజొన్న ఎకరానికి పాతిక నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతిశ్రీ కి రైతులు వివరించడం జరిగింది. ఈ విషయంపై లావేరు గ్రామపంచాయతీ నుంచి రైతులు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ కలెక్టర్ ఆఫీసుకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని రైతులుకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేనపార్టీ నాయకురాలు కాంతిశ్రీ మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా చూడాలని కలెక్టర్ కి చెప్పడం జరిగిందని, దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.