Logo
Date of Publish : 14 February 2022, 1:03 pm
Editor : Sake Naresh

నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 50000 వేలు రూపాయలు నష్టపరిహారం అందించాలి – దాచేపల్లి మండల జనసేన నాయకులు

    దాచేపల్లి, (జనస్వరం) : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తెల్ల తెగులు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వ్యవసాయ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే ఈ ప్రభుత్వానికి కనీసం రైతుల పట్ల వారు పడుతున్న కష్టాలపై కనీస చిత్తశుద్ధి లేదని, ఈ ఏడాది మిర్చి పంట వేసిన నష్టపోయిన మిర్చి రైతుకు ఎకరాకు 50000 నష్టపరిహారం అందించాలి- జనసేన సుమారు 70 శాతం మంది రైతులు నష్టపోయిన వారేనని, మీకు వారిపై ఏమాత్రం చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే నష్ట పరిహారంగా 50000 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం అందించని పక్షములో రైతు సంఘాలతో కలిసి వ్యవసాయ సంబంధిత కార్యాలయాల ముట్టడికి పిలుపును ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మందపాటి దుర్గారావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, తక్కెళ్లపాడు సర్పంచ్ శానం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ, బత్తుల వెంకయ్య, జనసేన నాయకులు తోట నాగేశ్వరరావు, నంబూరి మధు, కోట మధు, గురజాల నరసింహారావు, వేల్పుల చైతన్య, రుద్రాల అంజి జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com