తిరుపతి, ఏప్రిల్ 02 (జనస్వరం) : తిరుపతి నగరంలో ఎన్నికల కార్యనిర్వహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, నగర అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొనటం జరిగింది. తిరుపతి నగర వార్డ్ కమిటీ సభ్యులకు అరణి శ్రీనివాసులు డా.హరిప్రసాద్ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికలకు సన్నిద్ధం అవ్వాలని ప్రత్యర్థులకు ధీటుగా కష్టపడి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి కృషి చేయాలని తెలియజేశారు. కమిటీ సభ్యులు పార్టీ అభివృద్దికి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ మరియు రాష్ట్ర జిల్లా నాయకులు తోపాటు కమిటీ సభ్యులు పాల్గొని జనసేన పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. కమిటీ సభ్యులు అందరూ రాబోయే ఎలక్షన్ ని ఎదుర్కొనేలా సoసిద్ధమై ఉండాలని ఎట్టి పరిస్థితిలో రేపు కూటమిని గెలిపించుకునే విధంగా మనమందరం పార్టీ కోసం కలిసి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి పట్టణ నాయకులు, వార్డ్ అధ్యక్షులు జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com