ఆచంట నియోజకవర్గంలో జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
ఆచంట నియోజకవర్గంలో పెద్ద మల్లం గ్రామంలో మచేనమ్మ దేవస్థానంలో ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, నరసాపురం జనసేన పార్టీ పార్లమెంట్ చైర్మన్ శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు, ఆచంట నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆచంట నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉభయ గోదావరి సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు క్షేమంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు హాస్పిటల్ 50 వేల రూపాయలు జీవిత బీమా కింద ఐదు లక్షల రూపాయలు రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. మరే ఇతర పార్టీలు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పించిన అవకాశాన్ని కార్యకర్తలు అందరూ వినియోగించివలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.