సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జనవరి 19 రా కదలిరా భారీ బహిరంగ సభ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు నందు యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వ స్థాపనలో భాగంగా ప్రజలందరినీ కూడా మద్దతుగా కదిలి రమ్మని ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో ఎంత దోచుకున్నాడు. యువత పరిస్థితి నేడు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పడుతున్నటువంటి బాధలు కూడా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కాపాడాలనేటువంటి ఆలోచనతో ఒత్తులో భాగంగా రా కదలిరా విజయం భేరి మోగించాలని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని పై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లి కార్జున్, శ్రీ హరీ, బీకి దయాకర్, ముత్తుకురు మండల సీనియర్ నాయకులు రహీం, మనుబొలు మండల సీనియర్ నాయకులు సుబ్రమణ్యం, తది తరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com