Logo
Date of Publish : 31 March 2024, 5:06 pm
Editor : Sake Naresh

అధికారంలోకి రాబోయేది కూటమి ప్రజా ప్రభుత్వమే : జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

• మహిళా విభాగం బలోపేతానికి కమిటీలు వేసాం

• రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, తిరుపతి ఎంపీగా వెలగపూడి వరప్రసాద్ లను కూటమి తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం

       సర్వేపల్లి, మార్చి31 (జనస్వరం) :  సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ వీర మహిళ అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని అధ్యక్షతన వీర మహిళ విభాగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని మండలాల మహిళ కమిటీలు వేయడం జరిగింది. వెంకటాచలం మండల వీర మహిళ అధ్యక్షురాలిగా సందూరు సాయి శ్వేతా, మండల ఉపాధ్యక్షురాలిగా వలిపి కావేరి, ముత్తుకూరు మండల వీర మహిళ అధ్యక్షురాలిగా మన్నేపల్లి మస్తానమ్మ, పొదలకూరు మండల వీర మహిళ అధ్యక్షురాలిగా గురుపర్తి కామాక్షి రాకేష్ లను నియమించడం జరిగింది. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వీర మహిళ విభాగాన్ని 25 మంది మహిళలతో కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలోగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా మహిళ శక్తిని తయారుచేసి, భవిష్యత్తులో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ వీర మహిళ విభాగం బలంగా ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుంది. వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా జరిగాయి. రాబోయే ప్రజా ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తుంది. వైసిపి రాక్షస పాలనలో మహిళల హక్కులపై పోరాటం చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  మహిళలకు అండగా నిలిచారు. అలాంటి మహిళా శక్తిని బలోపేతం చేయడమే జనసేన పార్టీ లక్ష్యం. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో నేడు సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో వాళ్లందరిని కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునే దానికి నా వంతు నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నని తెలిపారు. కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలిగా నియమితులైన నాగరత్నంని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాగరత్నంకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, వీర మహిళ నాయకురాలు కంటే లక్ష్మి, జయసుధ, ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి రహీం, అశోక్, మస్తాన్, సుమన్, చిన్న, నవీన్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, చెంచయ్య, రామిరెడ్డి, పొదలకూరు మండల నాయకులు సంజు రాకేష్, మనుబోలు మండల నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com