Logo
Date of Publish : 05 October 2023, 9:44 pm
Editor : Sake Naresh

రాష్ట్రానికి పట్టిన గ్రహణం సీఎం జగన్ వైసీపీ పార్టీ

            విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో సూపర్ సక్సెస్ అవుతా ఉందని వైసిపి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూన్నారని అన్నారు. 50వేల పైచిలుకు జనం హాజరైనటువంటి అవనిగడ్డ సభ గురించి అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారి అవనిగడ్డ సభ యొక్క ఫోటోలు చూసి మాట్లాడాలని అదేవిధంగా పెడన సభకి రెండువేల మంది జనం కూడా రాలేదని వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం నుండి పెడన వరకు ర్యాలీగా వస్తే వేల సంఖ్యలో యువతీ యువకులు పవన్ కళ్యాణ్ గారి వెంట వచ్చారని అందుకనే పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న అపూర్వ స్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  పవన్ కళ్యాణ్ గారి పొత్తు ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చారని తద్వారా వైసిపి ఓటమి ఖరారు అయిందని అర్థం అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ప్రజా మద్దతు ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సూపర్ సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ గారి సభలను ఒక్క సాక్షి పేపర్ తప్ప మిగతా పేపర్లు అక్కడున్న వాస్తవాన్ని చాలా అద్భుతంగా రాశాయని, సాక్షి పేపర్ అసత్యాలకి అబద్దాలు కి విషపూరిత ప్రచారాలకి మార్పుగా మారిపోతుందని వైసిపి నాయకులు కూడా అవే మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు మనసున్న వ్యక్తి గనుకనే ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నటువంటి ఆపద్బాంధవుడని అన్నారు.  ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు స్పందించే ఏ అంశమైనా ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం అని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాలని రాజధాని అమరావతి నిర్మాణం చేయాలని , స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని , నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని ఇలా అనేక అంశాల మీద పోరాటం చేసిన వ్యక్తి గనుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నారని అది చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇస్తాను సార్ మాట్లాడుతున్నారని అన్నారు. పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతమైంది అని రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది ఇందులో జన సైనికులు వీర మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నారనే అక్కసుతోనే వారాహి యాత్ర సభల మీద విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇకమీదటైనా అబద్ధాలు కట్టబెట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానని అన్నారు. 

     జగన్మోహన్ రెడ్డి గారి సభలు వెలవెలబోతున్నాయని ఆయన సభలకు వచ్చిన జనం పారిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న వ్యాఖ్యలు విని ప్రజలు అక్కడే నిన్ను ఎందుకు నమ్మాలి జగన్ అని అక్కడే విమర్శలు చేస్తూ వెళ్ళిపోతున్న మాట వాస్తవం కాదా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్న జనం పోలీసులు గేట్లకి తాళాలు వేస్తున్న ఆ గేట్లు దూకి వెళ్ళిపోతున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. ఈ అంశాల మీద మంత్రి జోగి రమేష్ , అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడటం లేదని జగన్ సభలకు వచ్చిన జనం మాకు ఇదేం కర్మ రా బాబు అని పారిపోవడం నిజం కాదా అని ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వైసీపీ పార్టీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారని అందుకే కదా యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు స్థాపించడం లేదు అన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పోతున్నారని, ఇసక దొరక్క లక్షలాది మందికి నేటికి కూడా ఉపాధి లేదని మహిళలు ప్రభుత్వ బడిలో చదువుకునే పిల్లలు అదృశ్యమవుతున్నారని ఇది కదా వైసీపీ ప్రభుత్వ యొక్క పరిపాలన అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు మాకు ఇదేం కర్మ రా బాబు అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారని అందుకునే రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ కి ట్రాన్స్ఫార్మర్ కి 10వేలు, భూములు కబ్జా, ఇసుక మాఫియా , మట్టి మాఫియా ఇట్లా వందల కోట్లు అక్రమ సంపాదన సంపాదించాడని రాబోయే ఎన్నికల్లో జోగి రమేష్ ఓడిపోవడం ఖాయమని ఆ తర్వాత గుర్క లాంటి టైటిల్తో సినిమాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మాట్లాడడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com