* కరవు మండలాల ప్రకటన, సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం
* జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్
అనంతపురం ( జనస్వరం ) : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జిల్లా రైతులు అల్లాడుతుంటే రైతులకు ఏమి మేలు చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 7న సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారని జనసేన రాష్ట్ర కార్యనిర్వాహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షా బావ పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్న ఆదుకునేందుకు ఉమ్మడి జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించ కుండా… అసంబద్ధంగా కరవు మండలాలను ప్రకటించడమే కాక… కనీసం కరవు సహాయక చర్యలు కూడా చేపట్టకపోవడం సీఎం జగన్ రైతాంగం పై ఉన్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం అన్నారు. ఖరీఫ్ లో వేరుశనగ పంటను పూర్తిగా నష్టపోయిన. రైతులు చెరువులు, హెచ్‌ఎల్‌సి, హంద్రీనీవా, జీబీసీ కాలువల కింద సాగు పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వందలాదిగా… నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. వందల కోట్ల పెట్టుబ డులు నష్టపోతున్నారని, మిర్చి, పత్తి, జొన్న తదితర పంటలను సాగురచుల పంట పొలాలకు కనీస తడులు ఇవ్వగలిగితే కాస్తో కూస్తో సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికైనా హంద్రీనీవా తుంగభద్ర జలాల విషయంలో పాలకులు అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే పంట నష్టానికి వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఉద్యాన పంటకు లక్ష రూపాయలు, వాణిజ్య పంటలకు రూ.60,000, ఆహార పంటలకు రూ.30,000 _ నష్టపరిహారం ఇవ్వాలని… తక్షణమే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ఉమ్మడి అనంత జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్నదాతల పక్షాన జనసేన ఉద్యమిస్తుందని భవాని హెచ్చరించారు.